Shop information for www.jagritiweekly.com - My Lead Fox

www.jagritiweekly.com

https://www.jagritiweekly.com

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి ఎనలేని ప్రాజెక్టులను కానుకలుగా అందించగా, నవంబర్‌ 11, 12 ‌తేదీల్లో విశాఖ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులతో విశాఖ ఎగుమతుల హబ్‌గా మారి ఆదాయం పెంచుకుంటూ విశ్వనగరంగా రూపుదిద్దుకోనుంది. ఇది తెలుగువారికి మోదీ ఇస్తున్న గౌరవంగా మనం భావించాలి.కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన ఎనిమి దేళ్లలో ఏపీకి 8 లక్షల కోట్ల ప్రాజెక్టులను కేటాయిం చిన మోదీ వాటి ఆచరణలో కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ, సీఎం జగన్‌తో కలిసి రూ.10,742 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ. 7,614 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇక రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తూ దేశ అభివృద్ధిలో ఆంధప్రదేశ్‌ ‌కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదే వేదికపై విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకై అవసరమైన కార్యాలయం నిర్మాణానికి రూ.106 కోట్లను కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌తెలిపారు.ఫిషింగ్‌ ‌హార్బర్‌ అభివృద్ధికి నిధులువిశాఖపట్నం ఫిషింగ్‌ ‌హార్బర్‌ ఆధునికీకరణ, అప్‌‌గ్రేడేషన్‌కు పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 150 కోట్ల రూపాయలు. దీంతో ఫిషింగ్‌ ‌హార్బర్‌ ‌సామర్థ్యం రోజుకు 150 టన్నుల నుండి 300 టన్నులకు పెరుగుతుంది. సురక్షితమైన ల్యాండింగ్‌, ‌బెర్తింగ్‌, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు జెట్టీలో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి, వృథాను తగ్గించి ధరలు మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖపట్నం ఫిషింగ్‌ ‌హార్బర్‌ (‌వి.ఎఫ్‌.‌హెచ్‌)‌కు మహర్దశ పట్టింది. సరికొత్త హంగులతో వీఎఫ్‌హెచ్‌ ‌రూపురేఖలు మారనున్నాయి. రూ. 525 లక్షల పెట్టుబడితో విశాఖపట్నం పోర్ట్ ‌ద్వారా 1976లో ప్రారంభమైన వీఎఫ్‌హెచ్‌ ‌మత్స్యశాఖ నిర్వహణలో ఉంది. ఇది 24 ఎకరాల భూమిలో 1300 మీటర్ల వార్స్ ‌పొడవుతో ఉంది. 5 ఫిషింగ్‌ ‌జెట్టీలు, 6 వేలం హాల్స్, 1 ‌నెట్‌ ‌మెండింగ్‌ ‌హాల్‌, 24 ‌మంది అధికారులతో కూడిన ఎగుమతి సేకరణ కేంద్రం, విశాఖపట్నం ఫిషింగ్‌ ‌హార్బర్‌ ‌నుండి 1300 ఫిషింగ్‌ ‌వెసెల్స్, ‌రోజుకు 150 టన్నుల చేపలు, 700 మెకనైజ్డ్ ‌బోట్లు, 450 మోటరైజ్డ్ ‌బోట్లు, 15 బీచ్‌ ‌ల్యాండింగ్‌ ‌క్రాస్టు, 150 మోటారు లేని సాంప్రదాయ క్రాస్టు వీఎఫ్‌హెచ్‌లో పని చేస్తున్నాయ. ఫిషింగ్‌ ‌హార్బర్‌ ఏర్పాటైనప్పటి నుండి సాధారణ మరమ్మతులు, నిర్వహణ మినహా పెద్దగా పెట్టుబడి లేదు. తాజా కేటాయింపులతో చేపలు పట్టడం, నిల్వ చేయడం, ఎగుమతులు మెరుగుపరచడానికి, అదనంగా 15,000 కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి దోహదపడతాయి.ప్రాజెక్ట్ ‌కీలక టేక్‌ అవేలు కింది విధంగా ఉన్నాయి: ప్రస్తుతం బోట్లను అప్‌లోడ్‌ ‌చేయడానికి 2 గంటలు పడుతుంది. మొత్తం పక్రియ మాన్యువల్‌గా ఉంది. ఇది 40 టైపాలతో ఆటోమేట్‌ ‌చేస్తారు. ఇది చేపలను అప్‌లోడ్‌ ‌చేయడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది. చేపలను నేరుగా వేలం హాల్‌కు తరలించ డానికి కన్వేయర్‌ ‌సిస్టమ్‌ను ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు. పడవ నుండి వేలం హాలు వరకు యాంత్రిక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిషింగ్‌ ‌హార్బర్‌ ‌వద్ద బహిరంగ ప్రదేశంలో చేపలు ఎండబెడుతున్నారు. చేపలు ఎండటానికి 23 రోజులు పడుతుంది. ఇప్పుడు చేపలు వేగంగా ఎండేందుకు 20 మెకనైజ్డ్ ‌డ్రైయర్లు అమరుస్తారు. 450 కేఎల్‌డీ సామర్థ్యంతో రెండు ఎఫ్లూయెంట్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్లు అమరుస్తారు. అమ్ముడుపోని చేపలను నిల్వ చేయడానికి చిల్‌ ‌రూమ్‌ ‌సౌ�

Keywords:

Category:

City: Hyderabad

State: Telangana

Country: India (IN)

Currency :

Avg product price:

Platform: WooCommerce

Technologies used: Facebook SDK

Contact page: https://www.jagritiweekly.com/contact-us

Get Email Get Phone
Signup for Free. No Credit Card required.

Find WooCommerce stores worldwide and make them your client.

  • 691 shops on platform WooCommerce in Hyderabad.
  • Find more shops on WooCommerce in Telangana.
  • Find more shops on WooCommerce in India.
  • Find e-commerce stores worldwide and make them your client.

  • 2,099 shops on e-commerce in Hyderabad.
  • Find more shops on e-commerce in Telangana.
  • Find more shops on e-commerce in India.

  • < Previous Shop 3,498,677 of 10,181,674 Next >

    Get started with a simple yet powerful solution for acquiring leads?

    Suitable for marketing agencies, app developers and new business ideas.

    No credit card required.

    REF: 1467127